
"నిదురించే స్వప్నమా?
మేల్కొల్పే భావమా?
అదియే ప్రేమ సుమా,
నా జీవితం లో ఓ అందమైన కుసుమ...
కనుల పై నీ రూపు,
కలలలో నీ తలపు,
నీ భావన లో మలుపు,
ఎదకు రాదు ఎన్నటికి నీ మరపు...
కనులార నిను చూసుకుంటూ ,
కలకాలం నీతో కలసి ఉంటూ,
మనసారా నిను ప్రేమించుకుంటూ,
సాగాలి నా జీవని నీతోడు ఉంటూ .....!!!"