ఆ సంధ్యా వేళలో, ఆ సముద్ర తీరాన,
చల్లని గాలి నన్ను తాకుతూ, ఆ నీరు నన్ను తడుపుతూ,
ఉత్సాహం అలలా ఎగసిపడుతూ, ప్రశాంతత సముద్రం వలె పొంగి పోర్లుతుండగా...
"నువ్వు నాకు కనిపించావు
నీ రూపాన్ని సెలయెరుతోనూ,
నీ అందాన్ని ఇంద్రధనస్సు తోనూ,
నీ స్పర్శను దేవుని దయతోనూ,
నీ ఉరకలు పారే సెలయెరుతోనూ,
నిన్ను అన్ని కలిగియున్న దేవుని దూత తోనూ,
నువ్వు ఒసగే ప్రతిదీ కమ్మనైన తేనెతోనూ,
ఊహించు చుండగా, కళ్లు తెరవలేకపోయాను
నువ్వు కలలా కరిగి పోతావని!!
హృదయం చలించిపోయింది, నువ్వు విడిచిపెడతావని,
కాలం గడిచేసరికి కొవ్వొత్తి వెలుగువలె కరిగి పోతావని,
వర్షం తరువాత మబ్బులా కనుమరుగైపోతవని, నిన్నే తలచుకుంటూ ,నీకై మళ్ళి ఎదురు చుస్తూ , ఓ ఆనందమా!! నువ్వు నన్ను విడవని భావిస్తూ...."