కాంతి వంతమైన ఆ రవికిరణాలు,
ఘల్లు ఘల్లు మనే ఆ చిరుజల్లు,
ఏడు మురిపించే రంగుల ఆ ఇంద్రధనస్సు,
నీలి ఆకాశంలోని ఆ కాల మేఘాలు,
చంద్రుని చల్లనైన వెన్నెల తారలు,
ఇవన్ని అంతరిక్షానికి అందం చందం!
సొగసైన ఆ పర్వత శ్రేణులు,
ఒంపు సోపుల ఆ సెలయేరులు,
వికసించి, ఫలించే ఆ చెట్లు,
కోయిలమ్మ కమ్మని గానాలు,
నెమలి వినూత్నమైన నృత్యాలు,
ఇంక ఎనెన్నో ప్రకృతి మాతకు అందం చందం!
హృదయం పొందే సంతోషం,
మనసు పొందే ప్రశాంతత,
మనిషిలో వెలిగే మానవత్వం,
కన్నె సొగసులో అందం,
అలరించే ప్రతీ అందం కన్నా,
స్త్రీ జాతికి 'మాతృత్వం' అందం చందం!
No comments:
Post a Comment