Wednesday, January 21, 2009

వర్షం...!

ఓ జల్లుల వర్షమా,

నువ్వు కర్షకులకు వరమా!

నీ చిన్ని చిన్ని చినుకులు,

మా పంటలకే ఓ పలుకులు.

నీ చినుకుల తెల్లదనం,

మా పంటలకు పచ్చదనం.

నువ్వొస్తే మాకు పండుగ,

లేకపోతే పంటలు దండగ.

ఎప్పటికి మాకు అండగా!

ఉండిపోవాలి నీవు
మా పొలాల నిండుగా!!!

No comments: