Wednesday, January 21, 2009

ఆనందం నా తలుపు తట్టగా...

రవి నన్ను విడచిన ఆ క్షణాన్ని,
నీలి మేఘాలు కనిపించిన ఆ తరుణాన్ని,
పక్షులు తమగూల్లకు చేరు ఆ సమయాన్ని,
నా మదికి మరొక సంధ్య వేళ వచ్చిం
ది.

అలుపంటూ ఎరగని ఆనందం,
మృదువుగా నా హృదయం తలుపు తట్టిం
ది.
నా ఎదురుగా తను
కోటి కాంతులతో,
నిలుచొని నన్ను పిలువగోరింది...

తనను చూచి మైమరచిపోయి,
ఆ ఊహాతో అలసిపోయి,
తనను ఆహ్వనించడం మరిచాను,
కాని తనను నేనే గెలిచాను.

తను పలకరించడం మెదలు పెట్టింది,
తను శృతులను నాకు మిగిల్చింది..
ఎంతో సేపు మేమిద్దరం కలసి
ఉన్నాం,
చక్కని అనుబంధాన్ని పెంచుకు
న్నాం.

చివరికి నాకు ఒక మాట చెప్పింది,
నేనే తాను, తానే నేను అవడం తనకు
నచ్చింది.
జాబిలి ఆకాశ ఒడిలో ఒదిగి పోయి
నట్లు,
ఆనందం నా మనసులో కలిసి పోయింది.

No comments: