అలలై ఎగసిపడుతున్న నా సాహసానికి కారణం నువ్వే!!!
నాలో వికసిస్తున్న తేజానికి ప్రకాశానివి నువ్వే!!!
నాలో పెరుగుతున్న ధైర్యానికి రూపం నువ్వే!!!
నాలో ప్రహర్షించే గుణాలకి ఉధయించే సూర్య కిరణం నువ్వే!!!
నా మనసులో సాగే రాగానికి వేణునాధం నువ్వు!!!
నాలో జరిగే సంఘటనలకు విధిరాతావు నువ్వే!!!
నా ఆలనా పాలనా చుసేందుకు అమ్మకు ప్రతిగా వెలిసావు నీవు!!!
నాలో క్రమశిక్షణ పెంచి, నా బాధ్యత స్వీకరించి తండ్రికి మారుగా నిలిచావు నీవు!!!
నన్ను ఒక మనిషిలా దిద్దిన గురువుగా మిగిలావు నీవు!!!
అన్ని సులక్షణాలను నేర్పించి నాకు రూపం ప్రసాదించావు నీవు!!!
నిజం చప్పాలంటే ఆ రూపం నువ్వే ఎప్పటికీ నిలిచి పోతాను నువ్వే నేను గా!!!
No comments:
Post a Comment