Saturday, January 17, 2009

మనసు పడ్డ సూర్యుడు...

సెల యేరు గల గల నడుస్తుండగా
విహారంలో ఉన్న సూర్యుని మనసునపడ్డాయి
నల్ల మబ్బు తన సమ్మతి తెలిపింది
పిల్ల గాలి అందరికి కబురు అందించింది.

పచ్చని చెట్లు ఆనందంతో చిందులేసాయ
పక్షులన్నీ సంతోషబరిత శబ్దాలు చేయగా
కోయిలమ్మ తియ్యగా పాటనందు కోగా
నెమ్మలి అందంగా పురివిప్పి నృత్యించింది

రైతన్న ఆనందంగా తేరి చూడగా
భూమాత వారి రాకకు ఏర్పట్లు చేయగా
ఆకాశం పెద్ద మనసుతో వారిరువురిని చేర్చుకొంది
కొద్ది  క్షణాల్లో వారిరువురు ఒక్కటై భూమిని  స్పర్షించాయి

ఇలా వర్షం ఒక్క సారిగా కురవగా
పసి మనసులు ఆనందం పడ్డాయి
రైతన్నల హృదయాలు హర్షించాయి
అన్ధరూ కలసి "శుభం" చేకూరాలని దీవించారు

No comments: