చల్లగా చంద్రుడు ఉదయించే వేళ,
నా మది ఆనందంతో ఉరకలు వేసింది,
నా ఊహలు నిన్ను చేరుకున్నాయి.
నీ తీయని వెన్నెల నన్ను స్పర్శించింది,
వెంటనే ఆహ్లాదం నన్ను దర్శించింది.
నీవు ధరించిన పర్వత ఆభరణాలు,
లెక్కించడానికి సరిపోవు నా గణనాలు.
నీ మనసున వికసించిన పచ్చని చిగురు,
నీ మృదువైన సుగుణాలకు తెరమరుగు.
నీ గుండ్రని ముఖ ప్రకాశము,
నీళిని తొలగించు సదావకాశము.
కలతనలతలు లేని వ్యక్తిత్వం,
నీరును ధరించ నవసరం లేదు నిత్యం.
నీవు ఆకాశ వీధిలో ఒక ముత్యం,
నిను పొగుడుట లేదు ఇది నగ్న సత్యం.
నింగి ఒడిలోని జాబిలి నీవై,
అమ్మ ఒడిలోని బిడ్డను నేనై,
నింగిని తాకుతున్న నా ఊహలలోకానికి,
జాబిలమ్మ నువ్వే ఆకర్షణీయమైన రూపానివి....
No comments:
Post a Comment