Wednesday, January 21, 2009

పల్లెటూరి ప్రకృతి ...

అందాల సూర్యోదయం,
ఆ రోజుకే భానోదయం.
కిల కిల ఆడే పక్షులు,
అలాంటివి ఎన్నో లక్షలు.
మిల మిల లాడే కుసుమాలు,
మన సంతోషానికే వసంతాలు.
పచ్చ పచ్చగా ఉండే పంటలు,
వెళ్ళితే ఉండి పోవాలనిపిస్తుంది గంటలు..
అక్కడి మనుషుల పలకరింపు,
మన మనసుకే ఓ కలవరింపు...
అందరూ ఆప్యాయతలు పంచుకుంటూ,
ప్రతీ ఒక్కరు అనురాగాలు పుచ్చుకుంటూ,
మనకి ఆ రోజంతా ఆనందమయం..
ఆ రోజు అలా అస్తమయం...

No comments: