రెపరెపలాడుతుంది జాతీయ జెండా,
మన భారతదేశం నిండా.
ఎగురుతుంది మన తిరంగా జెండా,
మన అందరి హృదయం నిండా.
అందులో మూడు రంగులు,
మన దేశానికి ఫిరంగులు.
కాషాయం అంటే త్యాగం,
మన జీవితం లో భాగం...
తెలుపు అంటే శాంతి,
మనకు ఏనాడు ఇవ్వదు భ్రాంతి.
పచ్చ రంగంటే సౌభాగ్యం,
ఇస్తుంది మనకు జన్మ జన్మల భాగ్యం.
మన జెండా లోని అశోకచక్రం,
చూపుతుంది మన జీవిత చక్రం.
ఇన్ని గుణాలు వున్నమన జెండా,
గౌరవించాలి మనస్సు నిండా.
No comments:
Post a Comment