Thursday, January 22, 2009

వెన్నెల రాత్రి...

నిర్మలమైన ఆకాశంలో,
నిషబ్ధమైన మబ్బులతో,
కారు చీకటి కమ్ముతుంది.

అందమైన తారలతో,
వెన్నేలనిచ్చే చందమామతో,
అపురూపంగా ఆకర్షిస్తుంది.

రెండు మూడేళ్ళ చిన్న పాపతో,
తినిపిస్తున్న అన్నం గిన్నెతో,
ఒక అమ్మ కనిపిస్తుంది.

అందమైన చందమామను చూపించి,
ముద్దు ముద్దుగా అన్నం తినిపించి,
పాపాయిని నిద్రబుచ్చుతుంది!!!

No comments: