కనులలో కదులుతున్న నీ రూపం ,
కలలలో సృష్టించుకున్న రూపం,
హృదయం లో గీసుకున్న నీ రూపం,
చిన్నూ నువ్వు నా జీవితానికి దీపం.
ఊహలు నాకందకుండా సంచరించగా ,
ఆనందం నీవైపు తన చూపు మలిచెనుగా.
చిన్నూ!నీవు సంతోషానికి మరో రూపమా?
ఈ కదిలే కాలానికి ప్రతిరుపమా!
నా మదిలో ఓ చినుకై కురిసిన నువ్వు,
నా మనసున వికసించిన నీ చిరునవ్వు,
నా మనసుకై వెలసిన నా జీవం ,
నా మనసులో నాకై వెలిగిన ఆశదిపం నువ్వు !
చిన్నూ!నిను సృష్టించుకున్న ఆ క్షణాలూ ,
నా జీవితం లో మరపురాని అందమైన కోణాలు ,
చాలవు రా కన్నా!!నిను వర్ణించుటకు వర్ణించుటకు వర్ణాలు ,
వివరించుటకు చాలవు రా నీ మాటల్లో నీ స్వర్ణాలు!
మనసున నా చిరువాంఛ నీవై,
మమతకై వెలసిన ప్రతిరూపం నీవై,
నా ప్రాణానికి వెలసిన జీవం నీవై ,
ఏనాటికి నా మనసు నిండా నీ స్వరమే !!!
No comments:
Post a Comment