Tuesday, January 20, 2009

వేచిఉంటాను...!

స్నేహమనే తీయని బంధాన్ని నింపిన నేస్తమా,
నా జీవితంలోని నీ పాత్ర అంత మాధుర్యమా?
ఎన్నాళ్ళ నుంచో వేచి ఉన్నా నేస్తమా,
నువ్వు ఎప్పటికైనా కరుణిస్తావని,
ఎప్పటి నుంచో కలవరిస్తున్న నేస్తమా,
నువ్వే కలలా కరిగి పోకూడదని!
జీవితం అనే నా ఇంటిలో,
స్నేహం అనే బంధంలో,
దీపానివై ప్రకాశించి,
సంతోషం అనే వెలుగునింపి,
ఎప్పటికైనా నాతో ఉండి పోవాలి సుమా!
ఎప్పటికి వాడని నా జీవన కుసుమ!!
నీ స్నేహం కోసం ఓ నేస్తమా!
వేచ్చి ఉంటాను నిత్యం సుమా!!

No comments: