Tuesday, January 20, 2009

నేను నేనుగా ఆశ పడ్డాను...

జీవితమనే నావలో పయనించే ఓ మనిషి,

సాగిపో నీకు నీవే సాటి!

లేరు ఎవరూ ఇలలో నీకు మేటి!!

కను పాపను చూచి ఆశపడ్డాను-నువ్వు నా మనసులో నిలిచి పోతావని.

సముద్రంను చూచి ఆశపడ్డాను-నువ్వు అలవై ఎగసి పడతావని.

సూర్యున్ని చూచి ఆశపడ్డాను-నువ్వు రవికిరణాల వలె వెలిగి పోతావని!

ఇంద్రధన్నస్సును చూచి ఆశపడ్డాను-నువ్వు రంగు రంగుల్లో కలసి పోతావని..

ఆకాశం చూచి ఆశపడ్డాను-నువ్వు అంత ఎత్తు ఎదగాలని ,

చంద్రుని చూచి ఆశపడ్డాను-నువ్వు అంత అందంగా వుండాలని.

ప్రకృతి చూచి ఆశపడ్డాను-నువ్వు ఎప్పుడూ పచ్చగా ఉండాలని.

సముద్రపు నీరు చూచి ఆశపడ్డాను-నువ్వు ఎప్పటికీ కల్మషం కాకూడదని!!

పసి మనసు చూచి ఆశపడ్డాను-నువ్వు ఎప్పటికీ అంత అమాయకంగా వుంటావని!!!

దేవుని ప్రేమ చూచి ఆశపడ్డాను-నువ్వు నాకు ఆ ప్రేమను ఇవ్వ గలగాలని...

నేను ఆశపడిన వన్ని ఒకటిగా ఉండాలని ఆశపడ్డాను,

తన కోసం దగ్గర ఉన్నా ఎంతో అన్వేషణ చేశాను,

చివరికి నేను అనుభవిస్తున్న ఆ నిజం తెలుసుకున్నాను,

అది వీటన్నింటిని మించిన అమ్మ ప్రేమని తెలిసి మురిసి పోయాను!!!!

No comments: