నీవు కలవై కరిగిపొతావనీ...!
పెదవులకు పలుకు లేదు రా...
నీవు మాటల్లో జరిపోతావని...!
ఊహలకు జాడ లేదు రా...
నీ జాడ కోసం వెదికి వెదికి...!
మనసుకు ప్రశాంతత లేదు రా...
నీవు నాతో ఎప్పుడు కలుస్తావని...!
నేను నేనుగా ఇలలో లేను రా...
నీ తలపులలో మునిగిపోయి...!
నీ రాక కోసం వేచిఉంటాను రా...
నేను నీ శ్వాస అయ్యేంత వరకూ.....!
No comments:
Post a Comment