Thursday, January 22, 2009

హృదయమనే కోవెలలొ ...

చందమామను చూడు,
చల్లని వెన్నెలతో,
ఆకాశమనే ఒక కోవెలలో,
నెలకొని ఉంది ఆకాశ త్రోవలో.

నీరును చూడు,
ఉప్పు సారంతో,
సముద్రమనే కోవెలలో,
నెలకొని ఉంది సముద్ర త్రోవలో.

మనిషిని చూడు,
మానవత్వంతో,
భూమి అనే కోవెలలో,
నెలకొని ఉన్నాడు ఆ జీవిత త్రోవలో.

ఆకాశ కొవెలయిన,
భూమి అనే కొవెలయిన,
జీవితమనే కోవెలయిన,
చేరతాయి 'కవి హృదయమ'నే కోవేలలోకి.

No comments: