Thursday, January 22, 2009

ఆ సంధ్యావేళలో...


ప్రకృతి ఆహ్వానించింది ఆప్యాయంగా,
కాదన లేక పోయారు గారాభంగా!
చల్లగా మెల్లగా గాలి వీచింది,
హాయిని నాకు మెండుగా కలిపించింది,
సువాసన నాకు పూలహారంగా మారి,
సుగమయం చేసింది నా దారి...
ఘమ్మని ఆడే తూనీగా ,
కమ్మని తేనె ఇచ్చింది ఆతిథ్యంగా!
మనోహర ముఖము గల సూర్యుడు,
తనకు తనే సాటి అని పలకరించే చంద్రుడు!!
చల్లని నీడను ఒసగే వృక్షములు,
ఉండి పోవాలని పించింది లక్ష సంవత్సరములు...
అకస్మాత్తుగా కురిసెను చినుకుల జల్లు,
ఆనందిపజేసెను చక్కని హరివిల్లు!!!
చేరాను ఒక ఎతైన మెత్తని కొండ,
అది ఇచ్చెను ప్రియమైన అండ...
అదే ప్రకృతి మాత వెచ్చని ఒడి,
ఒదిగిపోయి వాల్చాను నా నుడి!!!

No comments: