"ప్రవహించే సంద్రాన్ని నేనై,
నా పై ఎగసిపడే కెరటం నీవై..
నిశి లో ఉన్న భువి నేనై,
నన్ను వెలిగించే రవికిరణం నీవై..
మెరిసే నక్షత్రాన్ని నేనై,
నా లోని మైమరిచే మెరుపు నీవై..
వికసించే చిరుమొగ్గను నేనై,
నాలో అందమైన పరిమళం నీవై..
మధురమైన మకరందం నేనై,
నాలో అనువైన తియ్యదనం నీవై..
మోడు బారిన 'జీవని' నేనై,
నాపై వర్షించే చిరుచినుకు నీవై..
అరుదైన ఇంద్రధనస్సు నేనై,
నాలో వికసించిన రంగులు నీవై..
సున్నితంగా స్పందించే మగువ నేనై,
నాలో తలపులన్ని నీవై...
నా అణువణువున నీవై,
నా కోసం నేనై,
తుదకు మిగిలావు
నా మనసే నువ్వై!! "