Monday, December 1, 2008

నాలోని కావ్యమేగా...!

కనిపించని కాలం లా,
వినిపించని గాలి శబ్దం లా,
స్పర్శించే మనోభావం లా,
ఉదయించెను నా మదిలో కావ్యమేగా!

దేవుని పాదాల వద్ద దీపం లా,
ఎగసిపడే తెల్లని కెరటం లా,
చెట్టు కొమ్మకు పచ్చని చిగురులా,
చిగురించెను నా మది లో కావ్యమేగా!

అమ్మ ఒడి లోని పసికందులా,
సముద్రపు ఒడి లోని ముత్యం లా,
ప్రకృతి ఒడి లోని వృక్షం లా,
ఎదిగెను నాలో ఇంతగా కావ్యమేగా!


పచ్చని అడవి లోని లేడి లా,
ఆకాశ వీధి లోని ఓ పక్షి లా,
అందంగా అలరించే హంస లా,
కావాలి నాలో పెరిగిన కావ్యమేగా!

ఆకాశ వీధి లో నక్షత్రం లా,
ఎప్పటికి మరువలేని రాగం లా,
అందరి హృదయానికి ప్రాణం లా,
నిలిచిపోవాలి ఎల్లపుడు నా కావ్యమేగా!

"కవిత్వం అనే ఆకాశం లో నేనుండగా,
కావ్యమేఘాలు నను కమ్మగా,
కావ్యం రాగాలు గా వర్షించగా,
చక్కని రోజా పూవై అందరికి మెండుగా,
ఎల్లపుడు అలా కావాలి నా కావ్యమేగా!!!"

1 comment:

chaitu said...
This comment has been removed by the author.