Thursday, December 4, 2008

అమ్మా నీవే నా ఆదర్శం !!!

మాతృత్వానికి నిదర్శనం అమ్మ!
         మమతను పంచే దైవం అమ్మ!!
 
మనసున ప్రతిస్టించుకున్న నీ రూపం,
మమతను పంచే నీ హృదయం,
అనురాగం నిండుకున్న నీ పలకరింపు,
ఆప్యాయతను పంచుతున్న  నీ స్పర్శ!

అమ్మా నీ చేతి కమ్మదనం,
నీ ఒడిలోని వెచ్చదనం  
నీవున్న చోటంతా పచ్చదనం,
నీవు నా అమ్మవు కావడం నాకు అచ్చమైన ధనం!!

అమ్మా పాడిన ప్రతీ జోల పాట,
అమ్మాతో ఆడుకున్న ప్రతీ ఆట,
అమ్మా మాట్లాడిన ప్రతీ మాట ,
నా జీవితానికి చూపాయి వెలుగు బాట!

నువ్వు భువిలో దేవుడు వెలిగించిన దీపం,
ఎన్నటికి మరువలేని రూపం,
ఈ చిన్ని కవిత నీకే అంకితం,
నిలిచిపోవాలి నీవు నాతో శాశ్వతం!!!