Saturday, January 17, 2009

"ఒక్కసారి ఆగండి!! అంటూ..."


చల్లని గాలిలో చిన్నగా ప్రకృతి మాత పలకరించింది,
మబ్బులు కమ్ముకొని వున్నా నీ
లి  ఆకాశం నన్ను పులకరించింది.
చెట్ల చల్లని గాలితో, పూల సువాసనలతో,
పక్షుల కిలకిలతో, పండ్ల యొక్క రుచులతో,
నా మది మైమరచి పోయింది!

బహు వెచ్చని వాతావరణంలో, అలసి ఉన్న మనషులతో,
యంత్రంలా గడిచి 
పోతున్న జీవితంలో,
ప్రకృతి అందాన్ని మరిచిపోయిన నిమిషంలో,
తనదైన ఒక వినూత్నమైన శైలిలో,
"ఒక్కసారి ఆగండి!" అన్నట్టు తన రూపాన్ని మార్చింది...

అందరి ఆశ్చర్యానికి కారణమయ్యి,
అందరి దృష్టిని ఆకట్టుకొని,
అందరికీ ఆనందాన్ని దయచేసి,
అందరి మనసులో పులకరింత పుట్టించి,
'నేన్నున్నాను' అంటూ గుర్తు చేసింది!

ఇక తనదైన వినోధాన్ని ప్రారంభించి,
నీలి మేఘాన్ని కారు మేఘంగా మార్చింది,
అందులోంచి తెల్లని మెరుపులు వెలిగించింది,
అందరి ఆనందాన్ని పంచుకొని మనస్పూర్తిగా నవ్వింది,
చల్లని ఆనంద భాష్పాలని టపటప మని రాల్చింది.

ఎండిన సారంలేని ఈ భూమిని తడిపింది,
పిల్లలను తడిపి ఆనంద సాగరంలో ముంచింది,
అందరికీ తన సహాయాన్ని అందించింది,
మనుషులకు ఉల్లాసాన్ని ఒసగింది,
అందరి హావభావాలను, అలసటను ఒక్క సారిగా మార్చింది!

నా ఆనందానికి అవధులు లేకుండా చేయడానికి,
తన వినోదాన్ని ఇంకొంచెం సేపు పెంచడానికి,
తన చుట్టూ వెండి గీత
ను  ఏర్పరచుకొని,
సూర్యుడుని, వాయువుని ఆహ్వానించి,
ఏడురంగుల ఇంద్రధనస్సు 
ర్పరచి నన్ను పల్ల వించింది!

అందరికీ ఆనందాన్ని పంచి,
అందరి హృదయాలలో నించి,
తను వచ్చిన కర్తవ్యం ముగించి,
నాకు దూరంగా, మళ్ళి వస్తానని 
అబయమిచ్చి,
మళ్ళి తన దారిలో కనుమరుగై పోయి,
ఆఖరికి తన తీపి జ్యపకాలను మిగిల్చింది!!

No comments: