అది దేవుని హస్తగతం.
అందులో కష్టాలు అనేవి వచనములు,
సుఖములు అనేవి అధ్యాయములు.
జీవితమే ఒక సముద్రం,
అలలు అనేవి కష్టాలు,
ఓడ అనేది సుఖాలు,
ఒడ్డు అనేది విజయము...
జేవితమే ఒక కావ్యం,
ఎడ్పించేవి కష్టాలు,
నవ్వించేవి సుఖాలు,
మురిపించేవి విజయాలు.
జేవితమే ఒక సంకేతం,
నలుపు సంకేతం కష్టాలు,
తెలుపు సంకేతం సుఖాలు,
గమ్మతు కలిగించేవి విజయాలు...
జేవితమే ఒక తోట ,
పువ్వులు అనేవి సుఖాలు,
తెగులు అనేవి కష్టాలు,
ఎదిరించి బ్రతకడమే విజయము.
జీవితమే ఒక వరం,
ఎన్నడు కాదు శాపం,
సుఖ ,దుఖాలు సమానంగా,
కలిగించును జీవనం విదానం గా...
కాబట్టి సుఖం చూసి అతిసయపడకు,
దుఃఖం చూసి అధైర్యపడకు ,
సుఖం లేక పోతే దుఃఖం కు విలువ లేదు,
దుఃఖం లేక పోతే సుఖం కు విలువ లేదు.
ఈ గడియె నిజం తెలుసుకో,
జీవితమును అర్ధం చేసుకో,
ఏది ఏమయినా చివరికి కలిగేది విజయం,
ఎందుకంటే అది దేవుడిచ్చిన దిగ్విజయం.
1 comment:
Super... nice motivational... poetry...
Post a Comment