సమయం అంటూ తెలియలేదు సుమా!
నీ మధురమైన ఆలోచనల్లో మునిగి పోయి,
కళ్ళలో కరగని దీపాలు వెలిగించాను,
నీ రాక నాకు మరుగు కాకూడదని,
మనస్సు నిండా ఉత్సాహం నింపాను,
నువ్వు నా వద్దకు చేరతావని,
మదికి ఆలోచనలే రానిచ్చాను,
అవి నీ రాక గురించేనని,
చెవికి క్షుణమైన పాఠాలే నేర్పాను,
నీ రాక నాకు వినబడాలని,
ఏర్పాట్లకే రెక్కలు తొడిగాను,
నీ రాక కోసం ఊహలు విహరించాలని,
నేను నేనుగా పూర్తిగా సిద్దపడ్డాను,
నీ అమూల్యమైన రాక గురించి,
ఎన్నెన్నో ఎళ్ళకైనా ఎదురు చూస్తాను,
ఓ ఆనందమా! నువ్వు నాలో చేరువైపోతావని!!
3 comments:
కోమలి వర్షించే... కావ్యామృత వల్లి... చాలా చాలా చాలా బాగుంది..
దీన్ని (ఎన్నెన్నో ఎళ్ళకైనా ఎదురు చూస్తాను), ఎన్నాళ్ళయినా ఎదురు చూస్తాను - ఇలా మారిస్తే బాగుంటుందేమో.
దేవులపల్లి కృష్ణశాస్త్రి - మంచి భావ కవి. ఆయన రచనలు మీకు ఉపయోగపడవచ్చు.
thnq all.........
Post a Comment